Visakhapatnam Secunderabad Vande Bharat Now run six days in a week except on Tuesdays: రైలు ప్రయాణికులకు ముఖ్యమైన అలర్ట్.. విశాఖ సికింద్రాబాద్ వందేభారత్ రైలు షెడ్యూల్ మారింది. ఈ విషయాన్ని రైల్వే శాఖ అధికారులు తెలిపారు. ఇప్పటి వరకూ ఈ రైలుకు ఆదివారం సెలవు ఇచ్చారు. అయితే ఇకపై మంగళవారం విరామం ఇవ్వనున్నారు. వారంలో మిగతా ఆరురోజులు సర్వీసులు కొనసాగనున్నాయి. విశాఖపట్నంలో తెల్లవారుజామున బయల్దేరే ఈ రైలు.. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు మధ్యాహ్నానికి చేరుకుంటుంది. డిసెంబర్ పదో తేదీ నుంచి తాజా నిర్ణయం అమల్లోకి రానుంది.