Fire engines for house cleaning in Vijayawada: వరద గుప్పిట్లో చిక్కుకుని విలవిలలాడిన విజయవాడ ఇప్పుడిప్పుడే కాస్త కోలుకుంటోంది. కొన్ని ప్రాంతాల్లో క్రమంగా వరదనీరు తగ్గుముఖం పడుతోంది. అయితే మరో సమస్య వారిని వెంటాడుతోంది. వర్షాలు, వరదల కారణంగా బురద ఇళ్లల్లోకి చేరింది. దీంతో వరద నీరు తగ్గుముఖం పట్టిన ప్రాంతాల్లో జనం ఇళ్లను శుభ్రం చేసుకునేందుకు ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలోనే ఇళ్లను శుభ్రం చేసేందుకు వంద ఫైరింజన్లను ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అగ్నిమాపక సిబ్బంది ఫైరింజన్ల సాయంతో ఇళ్లు శుభ్రం చేస్తున్నారు.