విజయవాడ వాసులకు అలర్ట్.. మార్చి ఒకటో తేదీ నుంచి రూల్స్ మారుతున్నాయి. హెల్మెట్ లేకుండా బండి తోలితే ఇకపై జేబుకు చిల్లుపడినట్టే. మార్చి ఒకటో తేదీ నుంచి హెల్మెట్ లేకుండా బైక్ నడిపేవారికి రూ.1000 జరిమానాగా విధించనున్నారు. హెల్మెట్ వాడకం పెంచాలని భావిస్తున్న విజయవాడ పోలీసులు ఈ నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు రోడ్డు ప్రమాదాల్లో ఎక్కువ శాతం మరణాలకు హెల్మెట్ లేకపోవడం కూడా కారణమనే ఆలోచనతో ఈ నిర్ణయం తీసుకున్నారు. అలాగే హెల్మెట్ వాడకంపై నగర పౌరులకు అనేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.