botsa satyanarayana Elected as a Visakhapatnam mlc: ఉమ్మడి విశాఖ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. పోటీలో ఎవరూ లేకపోవటంతో ఆయన గెలిచినట్లు రిటర్నింగ్ అధికారులు అధికారికంగా ప్రకటించారు. బొత్స సత్యనారాయణకు ధ్రువపత్రం అందించారు. ఇక శ్రావణ శుక్రవారం రోజు ఎమ్మెల్సీగా ఎన్నికవడం ఆనందంగా ఉందని బొత్స అభిప్రాయపడ్డారు. తనకు సహకరించిన అందరికి ధన్యవాదాలు తెలిపారు. మరోవైపు బొత్స సత్యనారాయణకు శాసనమండలిలో విపక్ష నేతగా నియమిస్తారనే ప్రచారం జరుగుతోంది.