విశాఖపట్నం రైల్వే స్టేషన్ లో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. కోర్బా నుంచి వచ్చిన రైల్లో మంటలు చెలరేగాయి. ఏసీ బోగీలు తగలబడిపోయాయి. బీ2. బీ7 ఎం1 బోగీలు పూర్తిగా బూడిదకాగా... రైల్వే స్టేషన్ పరిసరాల్లో దట్టమైన పొగలు అలుముకున్నాయి. రైలు ఆగి ఉండటంతోనే ప్రాణనష్టం జరగలేదు. ఈ రైలు తిరుమల ఎక్స్‌ప్రెస్‌గా కడపకు బయలుదేరి వెళ్లాల్సి ఉంది. ఈ ఘటనలో మొత్తం నాలుగు భోగీలు మంటల్లో కాలిపోయినట్టు అధికారులు తెలిపారు.