విశాఖలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు జనసేన పార్టీ నేతలు, అభిమానులు ఘన స్వాగతం పలికారు.రెండు రోజుల పర్యటన నిమిత్తం అల్లూరి సీతారామరాజు జిల్లాకు వెళ్లేందుకు విశాఖపట్నం విమానాశ్రయానికి చేరుకున్నారు. అనంతరం అక్కడి నుంచి రోడ్డు మార్గంలో డుంబ్రిగుడ మండలం పోతంగి పంచాయతీ పెదపాడు గ్రామానికి బయలుదేరి వెళ్లారు. మార్గమధ్యలో పెందుర్తి కూడలిలో పవన్ కల్యాణ్‌కు జనసేన పార్టీ అభిమానులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు.అభిమానులు ఒక్కసారిగా ముందుకు తోసుకుని రావడంతో పవన్ కళ్యాణ్ కారు లోపలికి వెళ్లిపోయారు. పెందుర్తి కూడలిలో గజ మాలతో పవన్ కళ్యాణ్‌కు గ్రాండ్‌గా స్వాగతం పలికారు.