విశాఖ మెట్రో ప్రాజెక్టులో కీలక ముందడుగు పడింది. ఈ ఏడాది అక్టోబర్‌లో విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టు పనులకు శంకుస్థాపన చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ క్రమంలోనే కీలక ముందడుగు పడింది. ఆసియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్ అధికారులు, మెట్రో రైలు అధికారులు విశాఖలో పర్యటించారు. మెట్రో స్టేషన్లు ఏర్పాటు చేయాలని భావిస్తున్న ప్రాంతాలను పరిశీలించారు. మూడు కారిడార్లతో 42 స్టేషన్లతో విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టు నిర్మాణం చేపట్టాలని డీపీఆర్ రూపొందించిన సంగతి తెలిసిందే.