విశాఖపట్నంలో సంచలనం రేపిన గర్భిణి అనూష హత్య కేసులో మరో కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. అనూషను చంపేందుకు ఆమె భర్త జ్ఞానేశ్వర్ గతంలో ఎన్ని వేషాలు వేశాడనేదీ ఒక్కొక్కటిగా బయటపడుతోంది. అనూషను ప్రేమించిన జ్ఞానేశ్వర్..పెళ్లికి ముందే శారీరకంగా కలుద్దామంటూ బలవంతం చేసినట్లు దర్యాప్తులో తెలిసింది. అయితే అనూష అందుకు ఒప్పుకోకపోవటంతో ఫ్యామిలీకి తెలియకుండా జ్ఞానేశ్వర్ పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి తర్వాత అనూషను వదిలించుకునేందుకు చాలా ప్లాన్లు వేశాడు. చివరకు మూడో కంటికి తెలియకుండా రాత్రి వేళ నిద్రపోతున్న సమయంలో అనూషను హత్య చేశాడు. కానీ ఓ అనుమానం.. జ్ఞానేశ్వర్ ప్లాన్ బెడిసి కొట్టేలా చేసింది.