వీకెండ్ వేళ.. విశాఖపట్నం ఆర్కే బీచ్ వద్దకు వచ్చిన వారికి శనివారం సాయంత్రం వింత అనుభవం ఎదురైంది. ఎప్పుడూ అలలతో హోరెత్తించే సముద్రం శనివారం సాయంత్రం వెనక్కి వెళ్లింది. దీంతో సముద్రపు లోపలి శిలలు బయటకు కనిపించాయి. సముద్రం సుమారుగా 400 మీటర్లు వెనక్కి వెళ్లటంతో బీచ్‌కు వచ్చిన వారు ఆశ్చర్యపోయారు. ఆ తర్వాత బయటపడిన శిలలపై నిలబడి సెల్ఫీలు దిగుతూ ఎంజాయ్ చేశారు. ఈ ఏడాది ప్రారంభంలోనే ఇలాంటి ఘటనే జరిగిందని గుర్తు చేసుకుంటున్నారు.