ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఆదేశాలతో నగరంలో వర్షాల కారణంగా తలెత్తే ఇబ్బందులను ఎదుర్కొవడానికి అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో వర్షాలు, ఈదురుగాలులు, వడగండ్లు పడడంతో అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. అంతే కాకుండా రానున్న 48 గంటల్లో పలు జిల్లాలో ఈదురుగాలులతో కూడిన వర్షపాతం నమోదవుతుందని హైదరాబావ్ వాతావరణ శాఖ పేర్కొంది. హైదరాబాద్‌లో మోస్తరు వర్షం పడే అవకాశం ఉందని తెలిపింది.