Andhra Pradesh Rains: ఏపీని వర్షాలు ముంచెత్తాయి.. మూడు రోజులుగా వాయుగుండం ప్రభావంతో కురిసిన వానలకు జనజీవనం స్తంభించింది. అయితే ఇవాళ కూడా వానలు పడతాయంటోంది వాతావరణశాఖ.. మోస్తరు నుంచి భారీ వర్షాలకు అవకాశం ఉందంటున్నారు. అయితే వర్షం కారణంగా వరదలు మాత్రం కొనసాగుతున్నాయి. రాష్ట్రంలో వాగులు, వంకలు పొంగిపొర్లాయి.. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ముఖ్యంగా విజయవాడ చరిత్రలో ఎరుగని విధంగా వర్షాలు పడ్డాయి.. అక్కడ పరిస్థితులు మరీ దారుణంగా ఉన్నాయి.