ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో కోళ్లు భారీ సంఖ్యలో చనిపోతూ ఉండటం కలకలం రేపుతోంది. డిసెంబర్ నుంచి ఈ ఘటనలు జరుగుతున్నాయని పౌల్ట్రీ రైతులు చెప్తున్నారు. డిసెంబర్ నెలలో కోళ్లల్లో అంతుచిక్కని వైరస్ మొదలైందని.. జనవరి నెలలో ఇది తీవ్రంగా మారిందంటున్నారు. ఇప్పటి వరకూ జిల్లా వ్యాప్తంగా లక్షల కొద్దీ కోళ్లు చనిపోయి ఉండొచ్చని పౌల్ట్రీ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కోళ్ల మృతికి వెనుక ఉన్న కారణాలు తెలుసుకునేందుకు శాంపిళ్లను భోపాల్ పంపారు. అటు 2012, 2020 లోనూ ఇదే తరహా వైరస్ వచ్చిందని స్థానిక పౌల్ట్రీ రైతులు చెప్తున్నారు.