పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రభుత్వం వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో అనేక ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. జిల్లాలో 18 నుంచి 50 ఏళ్ల మధ్య వయసున్న వారిలో 5 లక్షల 42 వేల మంది ఖాళీగా ఉన్నట్లు గుర్తించారు. తాడేపల్లిగూడెం మండలంలో ఎక్కువ మంది పనిలేకుండా ఉన్నారు. భీమవరంలో ఇంటి నుంచి పనిచేసే ఉద్యోగులు అధికంగా ఉన్నారు. ప్రభుత్వం టెక్నికల్ పరిజ్ఞానం ఉన్న నిరుద్యోగులకు ఉపాధి కల్పించేందుకు ఈ సర్వే చేపడుతోంది.