YS Jagan on Chandrababu: నేను వచ్చాను.. అందుకే రేటు మారింది..

1 year ago 42
ఆంధ్రప్రదేశ్ రైతులు తీవ్ర అవస్థలు పడుతున్నారని వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆరోపించారు. రైతులను పట్టించుకునే స్థితిలో ప్రభుత్వం లేదన్నారు. బుధవారం పొదిలి పొగాకు బోర్డును జగన్ సందర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన వైఎస్ జగన్.. చంద్రబాబు ప్రభుత్వంపై మండిపడ్డారు. గిట్టుబాటు ధరలు లేక రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఉందన్నారు. రైతు భరోసాను చంద్రబాబు ఎగ్గొట్టారని జగన్ ఆరోపించారు. హైగ్రేడ్‌ పొగాకుకు గిట్టుబాటు ధర దక్కడం లేదని విమర్శించారు. తాను వస్తున్నానని కొంతమేర రేట్లు పెంచారని జగన్ ఎద్దేవా చేశారు. పొగాకు రైతులను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని.. లేకుంటే వైసీపీ తరుఫున పెద్దఎత్తున ఉద్యమిస్తామని జగన్ హెచ్చరించారు.
Read Entire Article