YS Jagan Podili Tour : వైఎస్ జగన్ పర్యటనలో ఉద్రిక్తత.. రాళ్లు, చెప్పులతో దాడులు

9 months ago 17
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రకాశం జిల్లా పొదిలి పర్యటన వైసీపీ, టీడీపీ కార్యకర్తల మధ్య తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. మహిళలను కించపరిచేలా నాయకులను ప్రోత్సహిస్తున్న జగన్ క్షమాపణలు చెప్పాలని టీడీపీ నేతలు డిమాండ్ చేశారు. కొందరు జగన్‌కు వ్యతిరేకంగా ప్లకార్డులు పట్టుకొని, నల్ల బెలూన్‌లతో నిరసన తెలిపారు. గోబ్యాక్ జగన్ అంటూ నినాదాలు చేశారు. ఈ నేపథ్యంలోనే జగన్‌కు వ్యతిరేకంగా నిరసన తెలియజేస్తున్న టీడీపీ కార్యకర్తలపై వైసీపీ కార్యకర్తలు దాడికి యత్నించారు. టీడీపీ శ్రేణులు కూడా ప్రతిదాడికి దిగటంతో ఇరు వర్గాల మధ్య ఉద్రిక్తత చోటు చేసుకుంది. రెండు పార్టీల నేతలు ఒకరిపై ఒకరు రాళ్లు, చెప్పులు విసురుకున్నారు. దీంతో జగన్ పర్యటన ఉద్రిక్తతకు దారి తీసింది. కొన్ని చెప్పులు, రాళ్లు పోలీసులపై కూడా పడ్డాయి. దీంతో కొంతమంది పోలీసులు గాయపడ్డారు. వారందర్నీ సహచరులు ఆసుపత్రిలో చేర్చారు. ఈ దుర్ఘటనలో ఇరు వర్గాల కార్యకర్తలు కూడా గాయపడ్డారు.
Read Entire Article