YS jagan Raptadu: ఊడిగం చేస్తే ఉద్యోగాలు ఊడతాయ్.. వైఎస్ జగన్ వార్నింగ్

1 week ago 4
వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మంగళవారం రాప్తాడులో పర్యటించారు. రామగిరి మండలం పాపిరెడ్డిపల్లి గ్రామంలో వైసీపీ కార్యకర్త లింగమయ్య కుటుంబాన్ని వైఎస్ జగన్ పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన జగన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని, బిహార్ కంటే పరిస్థితులు దిగజారాయని మండిపడ్డారు ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందన్న వైఎస్ జగన్.. సీఎం చంద్రబాబు మెప్పుకోసం కొందరు పోలీసులు పని చేస్తున్నారని ఆరోపించారు. తమ టోపీలపై ఉన్న సింహాలకు సెల్యూట్‌ చేయకుండా చంద్రబాబుకు సెల్యూట్ చేస్తున్నారని మండిపడ్డారు. ఎల్లకాలం చంద్రబాబే అధికారంలో ఉండరన్న జగన్.. తాము అధికారంలోకి వస్తే తప్పు చేసిన వారిని ఎవరినీ వదిలిపెట్టేది లేదని హెచ్చరించారు. చంద్రబాబుకు ఊడిగం చేసేవారిని యూనిఫామ్ తీయించి.. చట్టం ముందు నిలబెడతామని వార్నింగ్ ఇచ్చారు.
Read Entire Article