ఎన్నికల సమయంలో టీడీపీ కూటమి ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల అమలుపై ఏపీ ప్రభుత్వాన్ని వైసీపీ అధినేత వైఎస్ జగన్ మరోసారి నిలదీశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే కాలర్ పట్టుకోవాలన్న చంద్రబాబు.. ఈ రోజు ప్రజలు కాలర్ పట్టుకుంటారనే భయంతో రెడ్ బుక్ రాజ్యాంగాన్ని నడుపుతున్నారని ఆరోపించారు. తాడేపల్లిలో విజయవాడ వైసీపీ కార్పొరేటర్లతో సమావేశమైన జగన్.. కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా వైసీపీ అఖండ మెజారిటీతో గెలుస్తుందని.. 30 ఏళ్లు అధికారంలో ఉంటామని ధీమా వ్యక్తం చేశారు. ఈ సారి జగన్ 2.0ను చూస్తారన్న జగన్.. అది వేరే రకంగా ఉంటుందంటూ హాట్ కామెంట్స్ చేశారు.