YS Jagan: మంచి చేసిన మనకే ఈ పరిస్థితి వస్తే.. చంద్రబాబు గతేంటో!

9 months ago 32
ఏపీలో టీడీపీ కూటమి పాలనలో రెడ్‌బుక్‌ రాజ్యాంగం అమలు అవుతోందని వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆరోపించారు., తప్పుడు కేసులు పెట్టి అక్రమ అరెస్టులు చేయిస్తున్నారని ఆరోపించారు. బుధవారం స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో వైఎస్ జగన్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఏపీ ప్రభుత్వం కక్ష సాధింపు రాజకీయాలకు పాల్పడుతోందని జగన్ ఆరోపించారు. ప్రభుత్వం చేస్తున్న తప్పులకు వత్తాసు పలికే అధికారులను మరోసారి వైఎస్ జగన్ హెచ్చరించారు. వచ్చేసారి ప్రభుత్వంలో కార్యకర్తలకు ప్రాధాన్యత ఉంటుందన్న వైఎస్ జగన్.. ఇప్పుడు జరిగే వాటిని రాసిపెట్టుకోవాలని.. మన ప్రభుత్వంలో రిటర్న్ గిఫ్టులు ఇద్దామంటూ కార్యకర్తలకు సూచించారు. మంచి చేసిన వైసీపీనే ప్రజలు విపక్షంలో కూర్చోబెట్టారన్న జగన్.. అవినీతి, అక్రమాలు, హామీలు అమలు చేయని చంద్రబాబు పరిస్థితి వచ్చేసారి ఏంటోనంటూ ఎద్దేవా చేశారు.
Read Entire Article