వైసీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. మంగళవారం రోజు విజయవాడ జిల్లా జైలుకు వెళ్లారు. రిమాండ్ ఖైదీగా ఉన్న మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీతో ములాఖత్ అయ్యారు. గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో సాక్షుల్ని బెదిరించారన్న కేసులో అరెస్టయిన వంశీ ప్రస్తుతం జైలులో ఉన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే వంశీని కలిసి జగన్ పరామర్శించారు. ఈ సందర్భంగా వంశీని అన్యాయంగా తప్పుడు కేసుల్లో ఇరికించారని ఆరోపించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు దిగజారాయని.. అందుకు వంశీ అరెస్టే నిదర్శనం అని అన్నారు.