Ys Jagan: వైఎస్ జగన్‌పై కేసు.. ఈ సెక్షన్ గురించి తెలుసా

8 months ago 10
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పల్నాడు జిల్లా పర్యటనలో.. సింగయ్య అనే వ్యక్తి చనిపోవటం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఈ కేసులో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను పోలీసులు నిందితుడిగా చేర్చారు. గుంటూరు ఎస్పీ సతీష్ కుమార్ ఈ విషయాన్ని ఆదివారం రాత్రి తెలిపారు. సింగయ్య అనే వృద్ధుడు కారు కింద పడి మరణించాడని వైరల్ అవుతోన్న వీడియో ఆధారంగా పోలీసులు ఈ కేసు నమోదు చేసినట్టు తెలిపారు. సింగయ్య మరణానికి కారణమయ్యారని ఆరోపిస్తూ బీఎన్‌ఎస్‌లోని 105, 49 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ కేసులో వాహనం నడిపిన డ్రైవర్ రమణారెడ్డిని A1గా చేర్చారు. అలాగే వైఎస్ జగన్‌ను A2గా.. అలాగే ఆయనతో ఉన్న జగన్ వ్యక్తిగత కార్యదర్శి కె.నాగేశ్వరరెడ్డిని A3గా, వైవీ సుబ్బారెడ్డిని A4గా, పేర్ని నానిని A5గా, విడదల రజినిని A6గా చేర్చారు. జగన్‌పై నమోదు చేసిన కేసులో బీఎన్‌ఎస్‌ 105 సెక్షన్ అంటే.. హత్య కిందకు రాని కల్పబుల్ హోమీసైడ్ అని అర్థం. అంటే ఒక వ్యక్తి మరణానికి కారణమైనప్పుడు ఈ సెక్షన్ కింద కేసు నమోదు చేస్తారు. నేరం నిరూపణ అయితే జీవిత ఖైదు విధించే అవకాశం ఉంది. నేర తీవ్రతను బట్టి 5 నుంచి 10 ఏళ్లు వరకు జైలు శిక్ష, జరిమానా కూడా విధించవచ్చు. ఇది నాన్ బెయిలబుల్ సెక్షన్. దీనితో పాటు, నేరానికి ప్రేరేపించారనే అభియోగంపై బీఎన్‌ఎస్‌ 49 సెక్షన్ కూడా చేర్చారు. అయితే, ఈ ఘటనకు సంబంధించి ఇంకా విచారణ జరుగుతోంది.
Read Entire Article