ఆంధ్రప్రదేశ్‌లో నూతన మద్యం పాలసీపై ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల విమర్శలు గుప్పించారు. మెజారిటీ మద్యం దుకాణాలను కూటమి నేతలకే కట్టబెట్టారని ఆరోపించారు. గత వైసీపీ ప్రభుత్వం గుడిని మింగేస్తే.. ప్రస్తుత ప్రభుత్వం గుడిలోని లింగాన్ని సైతం మింగేస్తోందంటూ వైఎస్ షర్మిల ఆరోపించారు. పారదర్శకతకు పెద్దపీట అంటూ చెప్పిన సీఎం చంద్రబాబు నాయుడు.. ఏసీ రూముల్లో కూర్చుని హెచ్చరిస్తే సరిపోతుందా అంటూ ప్రశ్నించారు. తమ తప్పులు వచ్చే రోజుల్లో బయటపడకుండా ఉండాలనే ఉద్దేశంతో పాత ప్రభుత్వం హయాంలో జరిగిన కుంభకోణాలను చూసీచూడనట్లు వ్యవరిస్తున్నారని వైఎస్ షర్మిల ఆరోపించారు.