ఏలూరు జిల్లాలో వైసీపీ మరో షాక్ తగిలింది. ఏలూరు వైసీపీ అధ్యక్ష పదవికి ఆళ్ల నాని రాజీనామా చేసిన వ్యవహారం మరిచిపోకముందే మరో గట్టి దెబ్బ తగిలింది. ఏలూరు మేయర్ నూర్జహాన్ దంపతులు వైసీపీకి గుడ్ బై చెప్పారు. వైసీపీని వీడి టీడీపీలో చేరిపోయారు. వారితో పాటు ఏలూరు పట్టణానికి చెందిన వైసీపీ ముఖ్య నేతలు టీడీపీలో చేరిపోయారు. వీరందరికీ మంత్రి నారా లోకేష్ కండువాలు కప్పి స్వాగతం పలికారు. మరోవైపు అభివృద్ధి కోసమే తాము పార్టీ మారినట్లు ఏలూరు మేయర్ నూర్జహాన్ తెలిపారు.