Police case on YCP MLC Bharath: వైసీపీకి మరో షాక్ తగిలింది. ఆ పార్టీ నేత, ఎమ్మెల్సీ భరత్ మీద కేసు నమోదైంది. తిరుమల తోమాల సేవ పేరిట సిఫార్సు లేఖలు విక్రయించారనే ఫిర్యాదుతో గుంటూరు అరండల్‌పేట పోలీసులు కేసు నమోదు చేశారు. టీడీపీ నేత చిట్టిబాబు ఫిర్యాదుతో భరత్ మీద కేసు నమోదైంది. భరత్‌తో పాటుగా ఆయన పీఆర్వోపైనా అరండల్ పేట పోలీసులు కేసు నమోదు చేశారు. మరోవైపు గత ఎన్నికల్లో భరత్ కుప్పంలో చంద్రబాబుపై పోటీచేసి ఓటమి పాలయ్యారు. ప్రస్తుతం ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు.