మాజీ మంత్రి, వైసీపీ నేత కాకాణి గోవర్ధన్ రెడ్డిపై కేసు నమోదైంది. పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ కాకాణి గోవర్ధన్ రెడ్డిపై టీడీపీ నేత ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా కావలి వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో కాకాణి గోవర్దన్ రెడ్డిపై కేసు నమోదు చేశారు. బోగోలు మండలంలో ఇటీవల టీడీపీ, వైసీపీ శ్రేణులు ఘర్షణ పడ్డాయి. ఈ గొడవలో గాయాలైన వైసీపీ వర్గీయులను పరామర్శించేందుకు కాకాణి.. కావలి ఆస్పత్రికి వెళ్లారు. అయితే ఈ సందర్భంగా ఆయన పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు.