పిఠాపురం రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. టీడీపీ ఇంఛార్జి ఎస్వీఎస్ఎన్ వర్మ కోపంతో పిఠాపురం పాలిటిక్స్‌లో హీట్ పెరిగింది. స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ కార్యక్రమంలో భాగంగా ఏర్పాటుచేసిన ఫ్లెక్సీలో చంద్రబాబు ఫోటో చిన్నదిగా వేశారంటూ ఎస్వీఎస్ఎన్ వర్మ అధికారులపై కోప్పడ్డారు. సమావేశంలో మాట్లాడకుండా కూర్చుకున్నారు. అనంతరం టీడీపీ నేతలతో అక్కడి నుంచి వాకౌట్ చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. చంద్రబాబుకే గౌరవం లేకపోతే తామెందుకు అంటూ కార్యక్రమం నుంచి వెళ్లిపోయారు వర్మ.