Roja in vennupotu dinam: ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలు చేయకుండా టీడీపీ ప్రభుత్వం ప్రజలకు వెన్నుపోటు పొడిచిందంటూ వైసీపీ జూన్ 4న రాష్ట్రవ్యా్ప్తంగా వెన్నుపోటు దినం పేరుతో నిరసన కార్యక్రమాలు చేపట్టింది. ఈ క్రమంలోనే నగరిలో జరిగిన వెన్నుపోటు దినం నిరసన కార్యక్రమాల్లో మాజీ మంత్రి ఆర్కే రోజా పాల్గొన్నారు. చెవిలో పూలు పెట్టుకుని నిరసన తెలిపారు. అనంతరం మాట్లాడిన రోజా.. హామీలు అమలు చేయకపోతే ప్రభుత్వాన్ని రోడ్డుకు లాగుతామని హెచ్చరించారు.