ఏపీలో వైసీపీకి మరో షాక్ తగిలింది. ఒంగోలులో ఆ పార్టీకి చెందిన కార్పొరేటర్లు టీడీపీలో చేరిపోయారు. ఒంగోలు మేయర్ సుజాతతో పాటుగా 12 మంది కార్పొరేటర్లు స్థానిక టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్ సమక్షంలో వైసీపీ నుంచి టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఒంగోలు అసెంబ్లీ ఎన్నికల్లో బాలినేని శ్రీనివాసరెడ్డి ఓటమి తర్వాత వైసీపీలో ఓ రకమైన నైరాశ్యం నెలకొంది. ఈ క్రమంలోనే కీలకంగా వ్యవహరించిన ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్ కార్పొరేటర్లను టీడీపీవైపు ఆకర్షించారు.