మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. పాదయాత్రపై జగన్ కీలక ప్రకటన చేశారు. బుధవారం రోజున ఏలూరు నియోజకవర్గం నేతలతో వైఎస్ జగన్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పాదయాత్ర ఎప్పటి నుంచి చేపడతాననే దానిపై జగన్ క్లారిటీ ఇచ్చారు. మరో ఏడాదిన్నర తర్వాత పాదయాత్ర చేపట్టనున్నట్లు ప్రకటించారు. అప్పటి వరకూ ప్రజల్లో ఉంటానని.. నియోజకవర్గాల వారీగా పార్టీ శ్రేణులతో సమావేశాలు నిర్వహిస్తానంటూ జగన్ ప్రకటించారు.