YSRCP: వైసీపీకి దెబ్బ మీద దెబ్బ.. ఒకే రోజు వరుస షాకులు..

1 year ago 37
వైసీపీకి బుధవారం వరుస షాకులు తగిలాయి. బుధవారం ఉదయం శాసనమండలి డిప్యూటీ ఛైర్‌పర్సన్ జకియా ఖానం వైసీపీ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. అలాగే ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా చేశారు. అనంతరం ఏపీ బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురందేశ్వరి సమక్షంలో బీజేపీలో చేరారు జకియా ఖానం. ఇక చీరాల మున్సిపల్ ఛైర్మన్ పదవిని కూడా వైసీపీ కోల్పోయింది. చీరాల మున్సిపల్ ఛైర్మన్ జంజనం శ్రీనివాసరావుపై పెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గింది. అయితే అంతకుముందే ఆయన మున్సిపల్ ఛైర్మన్ పదవికి రాజీనామా చేశారు. మరోవైపు జంజనం శ్రీనివాసరావు ఇప్పటికే టీడీపీలో చేరారు.
Read Entire Article