వైసీపీ సీనియర్ నేత సజ్జల రామకృష్ణారెడ్డిపై క్రిమినల్ కేసు నమోదైంది. అమరావతి మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఏపీ ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ కంభంపాటి శిరీష.. సజ్జలపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. తాడేపల్లి పోలీస్ స్టేషన్‌లో కంభంపాటి శిరీష ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా తాడేపల్లి పోలీసులు సజ్జల రామకృష్ణారెడ్డిపై క్రిమినల్ కేసు నమోదు చేశారు. త్వరలోనే నోటీసులు కూడా ఇస్తారని సమాచారం.