అంగన్వాడీ లబ్ధిదారులకు తీపికబురు. లబ్ధిదారులకు ప్రతి నెలా అంగన్వాడీ కేంద్రాలలో సరుకులు అందిస్తుంటారు. అయితే వేరే ప్రాంతానికి వలస వెళ్లడం, లేదా సరుకులు ఇచ్చే సమయానికి అందుబాటులో లేకపోవటం వంటి కారణాలతో సరుకులు అందుకోలేని పరిస్థితి . ఈ నేపథ్యంలో ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. పోషణ ట్రాకర్ యాప్‌లో మైగ్రేషన్ పేరుతో కొత్త ఆప్షన్ అందుబాటులోకి తెచ్చింది. దీంతో ఎక్కడి నుంచైనా సరుకులు పొందవచ్చని అధికారులు చెప్తున్నారు.