HYDRA Demolitions: హైదరాబాద్‌లో హడలెత్తిస్తోన్న హైడ్రా కూల్చివేతలపై హైకోర్టులో వాడీ వేడిగా విచారణ జరిగింది. ఈ విచారణలో భాగంగా.. హైడ్రా కమిషనర్ రంగనాథ్‌పై హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కే లక్ష్మణ్.. ప్రశ్నల వర్షం కురిపించారు. రూల్ ఆఫ్ లా ఫాలో కాకుండా కూల్చివేతలు చేపడితే మాత్రం.. చర్లపల్లి జైలుకో చంచల్ గూడా జైలుకో పంపించాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఈ క్రమంలో.. రంగనాథ్‌ను ప్రశ్నల మీద ప్రశ్నలు అడుగుతూ.. ఊపిరి సలుపుకోకుండా చేశారు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కే. లక్ష్మణ్.