భర్తతో దూరంగా ఉంటున్న ఓ మహిళ.. ప్రియుడితో కలిసి ఓ వ్యక్తి హత్యకు సుపారీ ఇచ్చింది. అయితే అడ్రస్ తేడాకొట్టడంతో అడ్డంగా దొరికిపోయింది. అనకాపల్లి జిల్లా ఎస్.రాయవరం మండలంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఓ వ్యక్తిని చంపేందుకు ప్రియుడితో కలిసి ఓ గ్యాంగ్‌కు మహిళ సుపారీ ఇచ్చింది. అయితే అడ్రస్ పొరబాటు కారణంగా సుపారీ గ్యాంగ్ మరో వ్యక్తిపై దాడి చేయడంతో ఈ బాగోతం బయటపడింది.. ఈ ఘటనలో మహిళ, ఆమె ప్రియుడు, మరో ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు.