రాయలసీమ పసిడి సీమగా మారనుంది. కరవు సీమలో బంగారు పంటలు పండనున్నాయి. కర్నూలు జిల్లా తుగ్గలి మండలం జొన్నగిరిలోని బంగారు గనులలో బంగారు ఉత్పత్తి ప్రారంభం కానుంది. సీఎం నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా బుధవారం రోజున జొన్నగిరి బంగారు ప్లాంట్ ప్రారంభం కానుంది. ఈ ప్లాంట్ ద్వారా తొలి సంవత్సరం 400 కిలోలు, రెండో సంవత్సరం వేయి కేజీల బంగారం ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఆ తర్వాత ఉత్పత్తి సామర్థ్యాన్ని ఏడాదికి 2 వేల కేజీలకు పెంచనున్నారు.