గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు ఆయన నివాసానికే బెదిరింపు లేఖ రావడం కలకలం రేపింది. 'అబ్దుల్ హఫీజ్' అనే వ్యక్తి పేరుతో వచ్చిన ఈ లేఖలో పోలీసు యంత్రాంగానికి సవాల్ విసురుతూ, రాజాసింగ్‌కు రక్షణగా ఉన్న భద్రతా దళాలను కూడా ఏమీ చేయలేనని పేర్కొన్నారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.