ఆలనా పాలనా చూడాల్సిన తండ్రి ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు. ఇన్నాళ్లు అండగా నిలిచిన అమ్మమ్మ ఇటీవలె కాలం చేసింది. కంటికి రెప్పలా కాచుకున్న తల్లి ఆకస్మాత్తుగా లోకం విడిచి వెళ్లిపోయింది. దీంతో మానసికంగా కుంగిపోయిన ఇద్దరు అక్కాచెల్లెళ్లు తల్లి శవంతోనే తొమ్మిది రోజులు గడిపారు. తిండితిప్పలు లేకుండా ఓ గదిలో తల్లి శవంతో మరో గదిలో వారిద్దరూ కాలం వెళ్లదీశారు. ఈ హృదయవిదారకర ఘటన సికింద్రాబాద్‌లో చోటు చేసుకుంది.