ప్రభుత్వం చేపట్టిన కులగణనపై రాజకీయ విమర్శలు చేయడం సరికాదని బీఆర్ఎస్ నేతలకు మంత్రి పొన్నం హితవు పలికారు. ఈ విమర్శలను బీసీలపై దాడిగానే పరిగణిస్తామన్నారు. బీసీల మేలు కోసం చేసే ప్రయత్నాలను అడ్డుకోవద్దని సూచించారు. కాస్ట్ సెన్సస్ డీటెయిల్స్ అందరికీ తెలిసేలా పబ్లిక్ డొమైన్‌లో పెట్టనున్నట్లు వెల్లడించారు. కులగణనపై సలహాలు, సూచనలు స్వీకరించేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని అన్నారు.