సెక్రటేరియట్‌లో సీఎం రేవంత్‌ను సీపీఎం నాయకులు బీవీ రాఘవులు గారు, జూలకంటి రంగారెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సీఎం వారికి ప్రభుత్వపాలనను వివరించారు. తాము ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు కష్టపడి పని చేస్తున్నామని తమకు సహకరించాలని కోరారు. ప్రభుత్వాన్ని నడిపేందుకు సలహాలు సూచనలు ఇవ్వాలన్నారు.