బెట్టింగ్ అప్పులు తీర్చేందుకు రికవరీ సొమ్మును కాజేసి, సర్వీస్ రివాల్వర్‌ను తాకట్టు పెట్టిన అంబర్‌పేట ఎస్ఐ భాను ప్రకాష్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆన్‌లైన్ బెట్టింగ్‌కు బానిసై ఈ దారుణానికి ఒడిగట్టినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. ఇటీవల ఏపీ గ్రూప్-2 పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించడంతో.. తెలంగాణ పోలీసు శాఖ నుంచి రిలీవ్ అయ్యి.. ఏపీలో కొత్త ఉద్యోగానికి సిద్ధమవుతున్న తరుణంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఇది ఆయన కెరీర్ మీద ప్రభావం చూపుతుంది అంటున్నారు.