వైకుంఠ ఏకాదశి సందర్భంగా అంబికా దర్బార్ బత్తి సంస్థ.. రాగస్వర సుప్రభాతం అనే వినూత్న అగర్‌బత్తి ప్రొడక్ట్‌ను తీసుకొచ్చింది. అయితే ఈ అగర్‌బత్తి ప్రొడక్ట్‌ను త్రిదండి చినజీయర్ స్వామి చేతుల మీదుగా ముచ్చింతల్‌లో ఆ సంస్థ ఆవిష్కరించింది. ఈ అగర్‌బత్తి బాక్స్ తెరిచిన వెంటనే ఆటోమేటిక్‌గా సుప్రభాత శ్లోకాలు వినిపించడం దీని ప్రత్యేకత. సువాసనతో పాటు మధురమైన శబ్దాన్ని మేళవించి రూపొందించిన ఈ ప్రొడక్ట్ భక్తులకు సరికొత్త భక్తి అనుభూతిని అందిస్తోందని ఆ సంస్థ వెల్లడించింది.