ఆరోగ్యం బాలేదని ఆస్పత్రికి వచ్చి.. ఖాళీగానే ఉంది కదా అని.. సరదాగా అలా అక్కవాళ్లింటికి వెళ్లొద్దామని అంబులెన్స్ వేసుకొని వెళ్లాడు ఓ ప్రబుద్ధుడు. కానీ.. మధ్యలోకి వెళ్లగానే ఒక్కసారిగా అదుపుతప్పి అంబులెన్స్ తిరగబడింది. ఈ ప్రమాదాన్ని గమనించిన స్థానికులు 108కి కాల్ చేస్తే.. ఇంకో అంబులెన్స్‌తో తీసుకొచ్చి మళ్లీ అదే ఆస్పత్రిలో పడేశారు. ఈ ఘటన.. సిద్దిపేటలో జరిగింది. ఈ ఘటన వెలుగులోకి రాగా.. ఇదే కర్మ అంటే.. అంటూ జనాలు కామెంట్ చేస్తున్నారు.