వరంగల్ మూమునూరు ఎయిర్‌పోర్టు భూసేకరణ తెలంగాణ ప్రభుత్వానికి తలనొప్పిగా మారింది. ఎయిర్‌పోర్టు నిర్మాణానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వగానే అక్కడి భూముల రేట్లు హఠాత్తుగా పెరిగాయి. ప్రభుత్వం ఎకరాకు రూ.40 లక్షలు ఇస్తామంటుండగా స్థానిక రైతులు ఎకరానికి రూ.2 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. మొత్తం 253 ఎకరాల భూమికోసం తెలంగాణ ప్రభుత్వం రూ.205 కోట్లు కేటాయించింది.