జహీరాబాద్ దగ్గర ఏర్పాటు చేస్తున్న ఈ పారిశ్రామిక ప్రాంతం(నిమ్జ్) కోసం భూసేకరణ జరుగుతోంది. ఇక్కడ రకరకాల ఫ్యాక్టరీలు, కంపెనీలు పెట్టుబడులు పెట్టి తమ ఉత్పత్తులను తయారు చేస్తాయి. దీని వల్ల చాలా మందికి ఉద్యోగాలు వస్తాయి.. ప్రాంతం కూడా అభివృద్ధి చెందుతుంది. దాదాపు 3 లక్షల మందికి ఉపాధి లభించే అవకాశం ఉంది. ఈ ప్రాంతానికి మంచి రోడ్డు కనెక్టివిటీ కూడా కల్పిస్తున్నారు. హైదరాబాద్-ముంబై జాతీయ రహదారికి అనుసంధానం చేస్తూ ప్రత్యేకంగా నాలుగు వరుసల రోడ్డును నిర్మించారు.