అచ్చమైన దసరా కానుక అంటే ఇదే.. వారికి భారీ శుభవార్త చెప్పిన తెలంగాణ ప్రభుత్వం..

11 months ago 22
తెలంగాణ ప్రభుత్వం పంచాయతీ కార్యదర్శులకు శుభవార్తను అందించింది. సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏకకాలంలో రూ.104 కోట్ల బకాయిలను విడుదల చేసింది. ఈ నిధులు త్వరలోనే పంచాయతీ కార్యదర్శుల ఖాతాల్లో జమ కానున్నాయి. ఇంత పెద్ద మొత్తాన్ని ఒకేసారి విడుదల చేయడం తొలిసారి కావడంతో కార్యదర్శులు సంతోషం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కలకు కృతజ్ఞతలు తెలిపారు. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తూ పంచాయతీ వ్యవస్థ బలోపేతానికి ఇది పెద్ద అడుగు అని పేర్కొన్నారు.
Read Entire Article