ఏపీ మంత్రి అచ్చెన్నాయుడుకు జనసైనికులు షాక్ ఇచ్చారు. అచ్చెన్నాయుడు పాల్గొన్న సమావేశంలో ఆందోళనకు దిగారు. దీంతో అక్కడ ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో అంబేద్కర్ కోనసీమ జిల్లా పి. గన్నవరంలో కూటమి పార్టీల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులు హాజరయ్యాయి. అయితే సమావేశంలో మాట్లాడుతున్న సమయంలో అచ్చెన్నాయుడు పవన్ కళ్యాణ్ పేరు ప్రస్తావించకపోవడంపై జనసేన నేతలు, కార్యకర్తలు మండిపడ్డారు. సమావేశంలో నిరసన వ్యక్తం చేశారు. దీంతో టీడీపీ జనసేన కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.