Atchutapuram The Brother Is Missing: అచ్యుతాపరం సెజ్‌లో జరిగిన ప్రమాదంలో ఓ యువతి తన అన్నను వెతుక్కుంటూ వచ్చారు. 'సార్.. సార్.. మీ దండం పెడుతాను..మా అన్నయ్యను వెతికి పెట్టండి సార్' అంటూ చేతులెత్తి దండం పెడుతూ ఆమె బతిమాలుతూ కనిపించారు. తన చేతులతో మొన్ననే రాఖీ కట్టానని.. ఇంతలో ఇలా తన అన్న కనిపించకుండా పోయాడంటూ ఆమె కన్నీళ్లు పెట్టుకున్నారు. ఈ సన్నివేశం చూసి అక్కడున్న అందరి కళ్లు చెమర్చాయి.