కూటమి ప్రభుత్వంపై వైఎస్ఆర్‌సీపీ అధికార ప్రతినిధి, యాంకర్ శ్యామల తీవ్ర విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో మహిళలకు భయం తప్ప భరోసా లేదని మండిపడ్డారు. వైఎస్ జగన్ ప్రభుత్వంలో అన్నా అని పిలిస్తే ఆదుకునే పరిస్థితి ఉండేదన్నారు. ఇప్పుడు అన్నా అని కేకలు వేసినా.. గగ్గోలు పెట్టినా.. గొంతెత్తి అరచినా ఎవరూ పట్టించుకోవడం లేదని దుయ్యబట్టారు. తిరుపతిలో లక్ష్మి అనే మహిళకు అన్యాయం జరిగితే.. డిప్యూటీ సీఎం స్పందించలేదు ఎందుకు అన్ని ప్రశ్నించారు. జనసేన నేత కిరణ్ రాయల్‌ను నమ్మి మోసపోయిన ఆమెనే తిరిగి అరెస్టు చేయించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్యాయానికి గురయ్యాయని బాధితురాలు గోడు వెల్లబోసుకున్నా పట్టించుకోవడం లేదని విమర్శించారు. చివరికి పోలీసులకు ఫిర్యాదు చేసినా కేసు నమోదు చేయలేదని, రాష్ట్రంలో మహిళలు భయంభయంగా బతకాల్సిన పరిస్థితి ఏర్పడింది.