సిద్దిపేట జిల్లాలో జరిగిన ఓ రోడ్డు ప్రమాదం వెనుక ఊహించని కుట్ర దాగి ఉంది. అప్పుల బాధతో ఒక అల్లుడు, కారుతో అత్తను గుద్ది చంపించాడు. చనిపోయిన ఆమె పేరు మీద ఉన్న 60 లక్షల రూపాయల బీమా డబ్బు కోసమే ఈ దారుణానికి ఒడిగట్టాడు. పోలీసులు కేసును చేధించగా అసలు నిజం బయటపడింది. ఈ హత్యకు దృశ్యం 2 సినిమా స్ఫూర్తి అని నిందితులు చెప్పడం సంచలనంగా మారింది.