రేవంత్ రెడ్డి, అల్లు అర్జున్ ఎపిసోడ్‌పై ఏపీ బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు స్పందించారు. అసెంబ్లీలో రేవంత్ రెడ్డి చెప్పింది నిజమే అయితే తాను రేవంత్ రెడ్డితో ఏకీభవిస్తున్నానని విష్ణుకుమార్ రాజు అన్నారు. అలాగే బెనిఫిట్ షోలు రద్దు చేయాలనేది తన వ్యక్తిగత అభిప్రాయమని విష్ణుకుమార్ రాజు చెప్పారు. ఒకవేళ బెనిఫిట్ షోలు ప్రదర్శించాలని అనుకుంటే ముందుగానే పోలీసుల అనుమతి తీసుకోవాలని సూచించారు. అలాగే తొక్కిసలాటలో ఓ మహిళ చనిపోయిందని తెలియగానే అల్లు అర్జున్ అక్కడి నుంచి వెళ్లిపోవాల్సి ఉండాల్సిందని విష్ణుకుమార్ రాజు అభిప్రాయపడ్డారు.