తెలంగాణ ప్రభుత్వం నకిలీ విత్తనాల బెడదను తగ్గించి, దిగుబడులు పెంచే లక్ష్యంతో జూన్ 2న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ‘నాణ్యమైన విత్తనాల పంపిణీ’ కార్యక్రమాన్ని ప్రారంభించనుంది. ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో 12,000 గ్రామాల్లోని 40,000 మంది అభ్యుదయ రైతులకు వరి, కంది, పెసర, మినుము, జొన్న వంటి ప్రధాన పంటల విత్తనాలను పంపిణీ చేస్తారు. నాణ్యమైన విత్తనాలు పొందిన రైతులు తిరిగి వాటిని తోటి రైతులకు అందించడం ద్వారా మూడేళ్లలో గ్రామంలోని అందరికీ నాణ్యమైన విత్తనాలు అందుబాటులోకి వస్తాయని, 10-15 శాతం అదనపు దిగుబడులు వస్తాయని అంచనా.